Search
Wednesday 20 June 2018
  • :
  • :

జానారెడ్డిని సస్పెండ్ చేసి ఆదుకున్నాం: జగదీష్‌రెడ్డి

Jagadish-Reddy

హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభపక్షనేత జానారెడ్డిని సస్పెండ్ చేసి తాము కాపాడామని, లేదంటే టిఆర్‌ఎస్‌తో కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ వాళ్లే జానారెడ్డిని సస్పెండ్ చేసేవాళ్లని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడిన జగదీష్ రెడ్డి… హత్యలు చేసేవాళ్లమైతే కోమటిరెడ్డినే టార్గెట్ చేసేవాళ్లం కదా? అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 112 స్థానాల్లో గెలిచి తీరుతామని జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్‌పై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల దాడిని మంత్రి తప్పుబట్టారు. ప్రజా ప్రతినిధులై అత్యంత పవిత్రమైన శాసనసభలో రౌడీలా ప్రవర్తించడం బాధకరమన్నారు.

Comments

comments