Search
Wednesday 20 June 2018
  • :
  • :

అసెంబ్లీలో ఎంఎల్‌ఎలు తిట్టుకున్నారు..! కొట్టుకున్నారు!

MLA's-Fight-in-Gujarat-Asse
గాంధీనగర్: గుజరాత్ విధాన సభలో సభ్యులు ఒకరినొకరు తన్నుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రాష్ట్రం అయిన గుజరాత్‌లో ఈ దుస్సంఘటన చోటుచేసుకుంది. బిజెపి, కాంగ్రెస్ పార్టీల ఎంఎల్‌ఏలు ఒకరినొకరు దూషించుకుని చూస్తుండగానే పరస్పరం దాడి చేసుకున్నారు. వ్యక్తిగత విమర్శలకుపోయి సభలో కొట్టుకున్నారు.
బిజెపిఎంఎల్‌ఎ జగదీష్ పాంచల్, కాంగ్రెస్ ఎంఎల్‌ఎ ప్రతాప్ దుదత్‌లు బుధవారం అసెంబ్లీ సమావేశం హాల్‌లో పరస్పరం వ్యక్తిగత విషయాలపై దూషించుకున్నారు. వారిద్దరిని వారించేందుకు ఇరు వర్గాలవారు ఎంత ప్రయత్నించినా ఆగలేదు. ఒకరినొకరు తిట్టుకుంటూ, నోటికొచ్చినట్లు తిట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పరస్పరం పెడిగుద్దులు కురింపిచుకున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీ సభ్యులంతా తమ ఎంఎల్‌ఎను తిట్టిన బిజెపి ఎంఎల్‌ఎతో వెంటనే క్షమాపన చెప్పించాలని డిమాండ్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో వారిద్దరిని కూడా మార్షల్స్ ద్వారా బయటకు గెంటేసి సస్పెండ్ చేశారు.

Comments

comments