Search
Wednesday 20 June 2018
  • :
  • :

షమీ మెడకు మరో ఉచ్చు..!

Mohammed-Shami

కోల్‌కతా: భారత మీడియం పేసర్‌ మహ్మద్‌ షమీ వివాహేతర సంబంధాల కేసు వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పుడు అది కాస్తా అతడి కెరీర్‌పైనే భారీ దెబ్బ కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సతీమణి హసీన్ జహాన్ ను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న షమీ కేసు బుధవారం మరో మలుపు తిరిగింది. ఇప్పటికే కోల్‌కతా పోలీసులు షమీపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా షమీ భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టాలని అవినీతి నిరోధక-భద్రతా విభాగాన్ని(యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ వింగ్‌) కోరింది. ఇంగ్లండ్‌కు చెందిన మహ్మద్ బాయ్ అనే మధ్యవర్తి ద్వారా పాకిస్తాన్ మహిళ నుంచి తన భర్త షమీ డబ్బులు తీసుకున్నాడని హసీన్ జహాన్ తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం విదితమే.

దీన్ని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ ఏసీఎస్‌యూ(యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ వింగ్)ని విచారణ జరపాలని ఆదేశించింది. ఎసిఎస్‌యు అధిపతి నీరజ్ కపూర్‌, షమీ కేసును విచారించి వారం రోజుల్లోగా నివేదిక అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక జహాన్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న బిసిసిఐ తాజాగా ప్రకటించిన కాంట్రాక్ట్ జాబితాలో షమీ పేరును తొలగించింది. అలాగే  మరోవైపు తనపై కావాలనే ఇలా పుకార్లు పుట్టిస్తున్నారని చెప్పాడు. తన కెరీర్ నాశనం చేయడానికే ఇలాంటివి సృష్టిస్తున్నారని తెలిపాడు. మీడియాలో వైరల్ అవుతున్నట్లు అసలేమి లేదని షమీ చెబుతున్నాడు. తాను ఏ తప్పు చేయలేదని, భార్య జహాన్ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధమని చెప్పుకొచ్చాడు.

 

 

Comments

comments