Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

అందరికీ పంచాలన్నదే నా ఆలోచన

manisha

ఇప్పుడు చాలామంది సీనియర్ నటులు పుస్తకాలు రాసేస్తున్నారు. తమ జీవితాలను పుస్తక రూపంలో మలచి అభిమానులకు కొత్త అనుభవాన్ని పంచుతున్నారు. వీరి జీవితంలో జరిగిన ఎన్నో తెలియని సంఘటనలు, వాటి వెనుక ఉన్న కారణాలు తెలుసుకునే అవకాశం ఈ పుస్తకాలతో కలుగుతోంది. బాంబే, భారతీయుడు, ఒకే ఒక్కడు వంటి దక్షిణాది చిత్రాల్లో నటించిన బాలీవుడ్ భామ మనీషా కొయిరాలా కూడా ఓ పుస్తకం రాస్తోంది. తన జీవితం గురించే రాస్తున్నా ఈ పుస్తకం ఆటోబయోగ్రఫీ మాత్రం కాదంటోంది మనీషా. “నాకు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. ఇక నా విజ్ఞానాన్ని అందరికీ పంచాలన్నదే నా ఆలోచన. నేను రాస్తున్నది నా ఆటోబయోగ్రఫీ కాదు. అయితే ఇందులో నా జీవితం, సినీ జీవితం గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాత్రం ఉంటాయి. నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు… చాలా విషయాలు రాశాను. అవే ఇప్పుడు నా పుస్తకానికి మూలం”అని అంటోంది మనీషా కోయిరాలా. ఈ భామ గతంలో క్యాన్సర్‌తో బాధపడి… ఆ మహమ్మారి నుంచి బయటపడ్డ సంగతి తెలిసిందే. క్యాన్సర్‌తో మనీషా  చేసిన పోరాటమే ఆమె రాస్తున్న పుస్తకానికి మెయిన్ థీమ్.

Comments

comments