Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

ఉగాది రోజున నాగ్-నానిల మల్టీస్టారర్ షురు

nn
హైదరాబాద్: అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఓ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో ఈ సినిమాలోని పాటలను మణిశర్మ కంపోజ్ చేస్తున్నారు.ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ మాట్లాడతూ.. మా వైజయంతి పతాకంపై మణిశర్మ చేసిన అన్నీ పాటలు మ్యూజికల్‌గా పెద్ద హిట్స్ అయ్యాయి. ఈ సినిమాలోని పాటలను కూడా అదేస్థాయిలో హిట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాము. మూడు పాటలకు సంభందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. మార్చి 18న ఉగాది పండుగా సందర్భంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాము. మా సంస్థలో వస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు.ఈ చిత్రానికి టి.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు.

Comments

comments