Search
Wednesday 20 June 2018
  • :
  • :

హస్తంలో నెంబర్ వన్ లెక్కలు

cong2

*గెలుపు నెంబర్ల వేటలో కాంగ్రెస్ అదిష్టానం
*ఆ నలుగురివైపే అందరి చూపు
*ప్రజా సేవల్లో ఇద్దరు … ప్రజల్లో మరో ఇద్దరు…
– పోటా పోటీగా చేపడుతున్న గెలుపు గుర్రాల సర్వేలు

మన తెలంగాణ/ మహబూబాబాద్ ఎడ్యుకేషన్: రానున్న 2019 ఎన్నికల నేపథ్యంలో సంవత్సర కాలం ముందుగానే పార్టీ అధిష్టానం ఏకగ్రీవంగా గెలిచే నాయకుల వేటల్లో పడింది. దీంతో మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో రాజకీయ వేడి రగులుతుంది. అధిష్టానం ప్రజల్లో ఇప్పటికే పేరు, పలుకుబడి ఉన్న నాయకులను గుర్తించటంలో ప్రజల్లో పై హస్తం, ప్రజా మన్ననలు పొందిన నాయకులను పరిశీలనలో పడినట్లు విశ్వసనీయ సమాచారం. అధిష్టానం, పార్టీ శ్రేణుల్లో ప్రస్తుత టీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు ధీటుగా ప్రజాధరణ పొందిన పేర్లలో ఆ నలుగురు పేర్లు ఉన్నట్లు తెలియవస్తుంది. ఇప్పటికే బొద్దుగొండ గ్రామ సర్పంచ్‌గా పనిచేస్తున్న గుగులోత్ సుచిత్రబాలునాయక్‌లు తమ దైన రీతిలో ప్రజా సేవలందిస్తూ తమదైన ముద్రను వేసుకుని ఉన్నారు. గత ఎన్నికలలోనే మహబూబాబాద్ శాసన సభ భరిలో నిలవటం కోసం తీవ్రంగా ప్రయత్నించటమే కాకుండా చిన్న వయస్సులోనే ప్రజల్లు అరుదైన సేవకురాలుగా పేరు ప్రఖ్యాతలను సాధించుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి హవా, తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ సానుభూతిలో ఉన్న ప్రజలు టీర్‌ఎస్ పార్టీకి ఏకగ్రీవంగా పట్టం కట్టిన రోజుల్లోనే పెనుతుపానులా, టీఆర్‌ఎస్ ఉద్యమ సెంటిమెంట్‌తో సీట్లు, ప్రజా ప్రతినిధుల స్థానాలు కొల్లగొట్టిన రోజుల్లోనే కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌పై అత్యధిక మెజారిటీతో బొద్దుగొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలుపును కైవసం చేసుకుంది. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్ భజనలో ఉన్న సమయంలోనే గ్రామ టీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు, అదిషానానికి చెమటలు పట్టిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారంటే రాజకీయంలో తనకున్న ’చాణుక్య’తను అర్థం చేసుకోవచ్చు.
2014 ఎన్నికల్లోనే అధిష్టాన హామీ
గతంలో జరిగిన ఎన్నికలలోనే పార్టీ అధిష్టానం ఢిల్లీ నుంచి వచ్చే ఎన్నికల భరిలో నిలుపుదామని హామీ తీసుకున్న గుగులోత్ సుచిత్రబాలునాయక్ 2019ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించి, శాసన సభపోటీలో భరిలో ఉంటారనేది జగమెరిగిన సత్యం. అధిష్టానం నుంచి హామీ పొందటంలోనే కాకుండా ప్రజా ఆధరణ ఉన్న మహిళా నాయకురాలిగా కూడా తనకు ఎన్నో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ప్రజలకు మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ అనాథలకు పుస్తకాలు, బట్టలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల తలలో నాలుకలా మెలిగి ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే ఎస్టీసెల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలిగా ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా, టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. అధిష్టానం, ప్రజా ప్రతినిధుల సర్వేలలో సుచిత్రా బాలునాయక్ పేరునే ముందుకు తెస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెరపైకీ అంతర్జాల వ్యాపార వేత్త జాటోత్ హుస్సేన్‌నాయక్
దేశంలోనే అంతర్జాల నెట్‌వర్క్‌పై తనదైన ముద్ర వేసుకుని ప్రజలకు మాయాజాల సేవలు అందిస్తున్న హుస్సేన్‌నాయక్ మహబూబాబాద్ జిల్లా ప్రజలకు ఓ ఇంటర్‌నెట్ కనెక్షన్‌లా ప్రజలలో చొచ్చుకుపోయి ఉన్న ప్రజా సేవకుడు. ప్రజలకు సుపరిచితుడైన హుస్సేన్‌నాయక్ గూడూరు మండలంలోని మచ్చర్ల గ్రామ శివారు సార్యతండాకు చెందిన ఓ పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి. మధ్యతరగతి కుటుంబంలో జన్మించినప్పటికి వ్యాపారంలో తన చదువు, తెలివితేటలతో దేశంలో ఓ అంతర్జాలాన్ని శాసించే స్థాయికి వెలిగిన హుస్సేన్ నాయక్ అంటే జిల్లా ప్రజలందరికి మక్కువే. తనకు ఆస్తులు అంతస్తులు ఏమీ వద్దని, తాను పుట్టిన గడ్డకు సేవ చేయాలని, ప్రజలు అవకాశమిస్తే తమ సేవలో తరిస్తానని ఇప్పటికే పలుమార్లు తన ప్రసంగాలను ప్రజలకు వినిపించినట్లు రాజకీయ మేథావులు అంచనాలు వేస్తున్నారు. హుస్సేన్‌నాయక్ ఇప్పుడు ఒక బడా వ్యాపార వేత్త కావటంతో ప్రజలకు తన సేవల్లో ఎలాంటి లోటు జరుగదని ప్రజలు బలంగా నమ్ముతున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. హుస్సేన్ నాయక్ రాజకీయాలలోకి వస్తే ఏ ప్రతి పక్ష పార్టీ భరిలో నిలువలేదని, నిలుచున్న డిపాజిట్లు కూడా దక్కవని జిల్లా విశ్వసనీయ వర్గం కోడై కూస్తుంది.
ప్రజాసేవలో నునావత్ రాధ
రాష్ట్ర, జిల్లా బాధ్యతలలో తనకంటూ ఓ ప్రత్యేక స్ధానం సాధించకున్న మహిళా నాయకురాలు నునావత్ రాద. గత అనేక సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి తనదైన రీతిలో సేవలు అందిస్తూ ప్రజా మన్ననలను పొందుతుంది. రాధ గూడూరు మండలం, పోనుగోడు గ్రామ శివారు రాములు తండాకు చెందిన నునావత్ రాధ ఇప్పటికే అదిష్టానం దృష్టిలో బేష్ అనే విధంగా సేవలు చేసి, అధిష్టా నం ఇచ్చే ప్రతి తీర్పుకు, ప్రతీ పనిలో ముం దంజలో ఉంటూ ప్రజాసేవే ల క్షంగా పార్టీలో తనదైన పేరు నమోదు చేసుకున్నారు. రానున్న 2019 ఎన్నికల నేపథ్యంలో ప్రజలు, పార్టీ నాయకులు నునావత్ రా ధాను భరిలో నిలిపితే విజయం వరిస్తుందనే ఆలోచనలో ఉన్నట్లు ఇప్పటికే ప్రజల్లో చర్చలు కొనసాగుతున్నట్లు స మాచారం. పార్టీకి సంబంధించిన ఏ సమావేశం జరిగినా ముందుండి కీలక పా త్ర పోషిస్తూ తనదైన రీతిలో ప్రజలకు తన సందేశాన్ని అందిస్తుంది. ప్రజా సమస్య లు భాగా తెలిసి, ప్రజలనుంచి వచ్చిన మహిళగా ప్రజల్లో గుర్తింపును కలిగి ఉన్నందున ప్రజలు నునావత్ రాధా వచ్చే ఎన్నికల భరిలో నిలుస్తారనే ఆలోచనలో పడ్డారు.
ఆశావాహుల్లో భూక్య ఉమామురళీనాయక్
మహబూబాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ భూక్య ఉమా మురళీనాయక్ ఇప్పటికే ప్రజలకు తనదైన రీతిలో సేవలు అందిస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగుతున్న రోజుల్లోనే కాంగ్రేస్ పార్టీ నుంచి గెలుపొంది పురపాలక సంఘం చైర్‌పర్సన్ కుర్చీని కైవసం చేసుకున్న భూక్య ఉమామురళీనాయక్ 2019 ఎన్నికల భరిలో నిలుస్తారని జిల్లా, పట్టణ కమిటీ నాయకులు చర్చించుకుంటున్నారు. కాని ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో చైర్ పర్సన్‌గా నిర్వహించిన బాధ్యతలలో చెప్పుకోదగిన పనులేమి చేయలేదని ప్రజలు బాహటంగా విమర్శిస్తున్నారు. అంతే కాకుండా సభలు, సమావేశాలలో తన స్థాయిని మరిచి నాట్యాలు, డ్యాన్స్‌లు చేయటం తన హుందా తనాన్ని కోల్పోయే విధంగా ఉండటంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. అంతే కాకుండా మహబూబాబాద్ శాశ్వత నీటి సమస్య పరిష్కారంలో విఫలమైనట్లు తెలుస్తుంది. ఏ విధంగా ప్రజలకు న్యాయం జరుగకపోవటంతో ప్రజలు భూక్య ఉమామురళీనాయక్‌పై అసహానంతో ఉన్నారు. అయినప్పటికీ టీఆర్‌ఎస్ హవా నడుస్తున్న సమయంలోనే గెలిచానని, ఇప్పుడు సునాయాసంగా గెలుస్తానని అధిష్టానానికి వివరిస్తూ టికెట్‌కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ మేథావులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఏవరికి టికెట్ వస్తుందో 2019 నాటికి వేచి చూడాల్సిందే.

Comments

comments