Search
Wednesday 20 June 2018
  • :
  • :

సమస్యలపై పోరాటం చేయడమంటే ఇష్టం: పవన్

Pawan-Kalyan

అమరావతి: గుంటూరులోని నాగార్జునా యూనివర్సిటీ ఎదురుగా జనసేన నిర్వహిస్తున్న పార్టీ ఆవిర్భావ మహాసభ ప్రాంగణానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేరుకుని వేదికపై మాట్లాడుతూ…. భారత్ మాతాకీ జై అంటూ పవన్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సమస్యలపై పోరాటం చేయడం అంటే తనకు ఇష్టమని, సమకాలీన రాజకీయ వ్యవస్థ ప్రజలను వంచించినందుకే జనసేన పార్టీ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ప్రజల మనిషిగా ప్రజల ముందుకు వచ్చి తాను పార్టీ పెట్టానని జనసేనాని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రుల ఆవేదనను తెలియచేద్దామని అన్నారు. కాగా, జనసేన యువజన విభాగానికి నేతాజీ యువసేనగా, మహిళా విభాగానికి ఝాన్సీ లక్ష్మి వీర మహిళా సేనగా, విద్యార్థి విభాగానికి భగత్ సింగ్ విద్యార్థి విభాగంగా పేర్లు పెడుతున్నట్లు ఈ సందర్బంగా పవన్ ప్రకటించారు.

ప్ర‌త్యేక హోదాపై కేంద్రం ఎపికి చేసిన ద్రోహాన్ని ఢిల్లీకి విన‌ప‌డేలా ప్ర‌శ్నిద్దామ‌న్నారు. గత నాలుగేళ్లుగా ఎపి ప్రజలకు కేంద్ర ప్ర‌భుత్వం అన్యాయం చేస్తూనే ఉంద‌ని పవన్ పేర్కొన్నారు. ‘మీరిచ్చిన మాట‌ల‌ను మీరు నిల‌బెట్టుకోన‌ప్పుడు మీ చ‌ట్టాల‌ను మేమెందుకు పాటించాలి?’ అని జనసేనాని కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్ర‌క‌ట‌న ఆంధ్రుల‌ గుండెల్ని పిండేస్తోందన్నారు. సెంటిమెంట్ తో ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పిన జైట్లీ.. ఆనాడు సెంటిమెంట్ తో తెలంగాణను ఎలా ఏర్పాటు చేశారని పవన్ దుయ్యబట్టారు. విభ‌జ‌న స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న బిజెపి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని వ్యాఖ్యానించి, తీర ఇప్పుడు అధికారంలోకి వచ్చాక హోదా ఇవ్వలేమని చెప్పడం ఎంతవరకు సమంజసమని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

comments