Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

నా మీద ఏదైనా దాడి జరిగితే..

pawan

అమరావతి: ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎపి డిజిపి మాలకొండయ్యకు లేఖ రాశారు. బుధవారం గుంటూరులోని నాగార్జున వర్సిటీ ఎదురుగా జరిగే జనసేన ఆవిర్భావ సభ భద్రతకు పోలీస్ శాఖవారు తీసుకుంటున్న జాగ్రత్తలకు జనసేనాని కృతజ్ఞతలు తెలిపారు. మార్చి 14 తర్వాత కూడా నాకు అందిస్తున్న భద్రతను అలాగే కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. నా మీద ఏదైనా దాడి జరిగితే అది ప్రజా జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం సమాజంలో ఉన్న కుల ఉద్యమాలు, వర్గ పోరాటాలు, రాజకీయ అణచివేతల నడుమ నా భద్రత సున్నితమైన సామాజిక రాజకీయ సమస్యలతో ముడిపడి ఉంది. భద్రతకు పోలీసులు నిస్సహాయత ప్రకటిస్తే.. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ప్రభుత్వామే బాధ్యత వహించాల్సి ఉంటుదని పవన్ లేఖలో పేర్కొన్నారు.

Comments

comments