Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

టర్కీలో విమాన ప్రమాదం : 11మంది మృతి

MINA

టెహ్రాన్ : టర్కీకి చెందిన ఓ ప్రైవేటు జెట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. షార్జా నుంచి ఇస్తాంబుల్ వెళుతుండగా ఇరాన్ భూభాగంలోని పర్వతశ్రేణుల్లో ఈ విమానం ఆదివారం రాత్రి కూలిపోయింది. ఈ విమానం పర్వతాన్ని ఢీకొనడంతో మంటల్లో పేలిపోయిందని ఇరాన్ అధికారిక టివి ఛానల్ వెల్లడించింది. ఈ విమానం టర్కీకి చెందిన వ్యాపారవేత్త బసరన్ హోల్డింగ్‌కు చెందినదని ఆ ఛానల్ పేర్కొంది. టర్కీ దేశంలో ఆయనకు నిర్మాణం, ఫుడ్, ఎనర్జీ, ఫైనాన్స్‌కి చెందిన వ్యాపారాలు ఉన్నాయి. వీటికి ఆయన కుమార్తె మినా బసరన్ (28) బోర్డు ఆఫ్ డైరెక్టర్‌గా ఉన్నారు. మరో నెల రోజుల్లో మీనా పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి బ్యాచిలర్స్ పార్టీ చేసుకునేందుకు విమానంలో వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. విమానం ఎక్కినప్పుడు దిగిన ఫొటోలను మీనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అనంతరం ఈ ప్రమాదం జరగడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది.

Plane Crash in Turkey : 11People died

Comments

comments