Search
Sunday 27 May 2018
  • :
  • :

ఆర్‌బిఐ కీలక నిర్ణయం…

RBI

ముంబయి: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రేడ్ క్రెడిట్ కింద ఇచ్చే లెటర్ ఆఫ్ అండర్ టేకింగి(ఎల్‌ఒయు), లెటర్ ఆఫ్ కంఫర్ట్(ఎల్‌ఒసి)లను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బ్యాంక్ ఉద్యోగులను మభ్యపెట్టి తప్పుడు ఎల్‌ఒయులతో వ్యాపారవేత్తలు భారీగా స్కాంలకు పాల్పడుతుండటమే దీనికి కారణమని తెలిసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అధికారులు ప్రకటించారు. ఆర్‌బిఐ నిర్ణయంతో దిగుమతి దారులకు భారీ షాక్ తగిలినట్లైంది. పరిశ్రమ వర్గాలు ఆర్‌బిఐ నిర్ణయంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఎల్‌ఒసి రూపంలో బ్యాంకు గ్యారంటీలు పొందే దిగుమతుదారులను ప్రభావితం చేయనుందని వాదిస్తున్నాయి.

Comments

comments