Search
Wednesday 20 June 2018
  • :
  • :

రెడ్‌మీ 5 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది…

Redmi-5

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారు షావోమి తాజాగా రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గతేడాది డిసెంబర్‌లో చైనాలో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ను బుధవారం ఇండియన్ మార్కెట్‌లో కూడా ప్రవేశపెట్టింది. ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌ ఇండియా ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెస్తోంది. మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఒకటి 2జిబి ర్యామ్‌, 16జిబి స్టోరేజ్‌ వేరియంట్‌ ధర వచ్చేసి రూ. 7,999… రెండో వేరియంట్‌ 3జిబి ర్యామ్‌, 32జిబి స్టోరేజ్‌ ధర వచ్చేసి రూ. 8,999… మరొకటి 4జిబి ర్యామ్‌, 64జిబి స్టోరేజ్‌ వేరియంట్‌ దీని ధర 10,999 రూపాయలుగా షావోమి ప్రకటించింది. ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌ ఇండియా‌తో పాటు ఎంఐ.కామ్‌, ఎంఐ హోమ్‌ స్టోర్లలో  మార్చి 20 నుంచి ఈ ఫోన్‌ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

రెడ్‌మి 5 ఫీచర్లు….
5.7 అంగుళాల హెచ్‌డి ప్లస్‌ తాకె తెర(720 x 1440 రిజూల్యుషన్)
ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 450 ఎస్‌ఒసి
2జిబి, 3జిబి, 4జిబి ర్యామ్‌ వేరియంట్లు
16జిబి, 32జిబి, 64జిబి ఇంటర్నల్ స్టోరేజీలు(మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జిబి వరకు విస్తరించుకునే సదుపాయం)
12 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా విత్‌ ఎల్‌ఇడి సెల్ఫీ లైట్‌
స్మార్ట్‌ బ్యూటీ 3.0 యాప్‌
ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, 4జి విఒఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3300 ఎంఎహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ చార్జింగ్

Comments

comments