Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

శ్రీదేవి మృతి కేసు : పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు

Sridevi

ఢిల్లీ : నటి శ్రీదేవి మృతి ఘటనపై వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. శ్రీదేవి మృతిపై దుబాయ్, భారత్ అధికారులు సమగ్ర వివరణ ఇచ్చారని జస్టిస్ గీతా మిట్టాల్, హరిశంకర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. యుపికి చెందిన సునిల్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీదేవి మృతి చెందిన సమయంలో సునిల్ సింగ్ దుబాయ్‌లోనే ఉన్నాడు. ఎమిరేట్స్ హోటల్ సిబ్బంది, దుబాయ్ హాస్పిటల్ వర్గాలతో తాను మాట్లాడానని, శ్రీదేవి మృతిపై వాళ్లు భిన్న కథనాలు చెప్పారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్రీదేవి మృతిపై విచారణ చేపట్టాలన్న ఆయన విన్నపాన్ని కోర్టు తోసిపుచ్చింది.

Sridevi Death Case : Court Rejects the Petition

Comments

comments