Search
Wednesday 20 June 2018
  • :
  • :

జనసేన సభలో తొక్కిసలాట…

Janasena-Meeting

అమరావతి: గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా 35 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతోన్న జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ ప్రాంగణానికి పెద్ద ఎత్తున జనసేన కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు తరలి వ‌చ్చారు. స‌భా ప్రాంగ‌ణం వ‌ద్ద‌ భారీగా భ‌ద్ర‌తా సిబ్బంది ఉన్న‌ప్ప‌టికీ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌ను అదుపు చేయ‌లేక‌పోయారు. స‌భా ప్రాంగ‌ణానికి కుడివైపున ఓ బారీకేడ్ తెంచుకుని అభిమానులు ముందుకు దూసుకువ‌చ్చారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఈ ఘటనలో 10 మంది జనసేన కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

Stampede in Janasena Party Meeting in Guntur.

Comments

comments