Search
Wednesday 20 June 2018
  • :
  • :

టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం

banner*అభివృద్ధిలో దూసుకుపోతుంది

మనతెలంగాణ/రంగారెడ్డి :
తెలంగాణ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి దూసుకుపోతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం శంకర్‌పల్లి మండలంలోని ఫతేపూర్‌లో రైల్వేట్రాక్, మూసినదిపై నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని, మార్కెట్ నుంచి ప్రధాన రోడ్డును చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్యతో ప్రారంభించి మార్కెట్ కమిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించి రోడ్డులు, మార్కెట్ గోదాములు కోట్ల రూపాయాల నిధులతో అభివృద్ధి పర్చడం జరిగిందన్నారు. శంకర్‌పల్లికి ఫోర్‌లైన్ రోడ్లతో పాటు రింగ్ రోడ్డు రావడంతో ఇక్కడి ప్రాంత రైతులకు భూముల ధరలు భారీగా పెరిగాయని భవిష్యత్తులో మరింత పెరుగుతాయన్నారు. శంకర్‌పల్లిలో పాలిటెక్నిక్ కళాశాల మంజూరు అయ్యిందని, మున్సిపాలిటీగా మారనుందన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షులు డి.వెంకట్‌రెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఒగ్గు మల్లేష్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ గోపాల్, సర్పంచులు వై.ఆనంద్, మాణిక్‌రెడ్డి, ఎంపీటీసీలు అశోక్‌కుమార్, రవీందర్‌గౌడ్, మల్లేష్, మాజీ ఎంపీపీలు సత్యనారాయణ, బిర్ల నర్సమ్మ, ఎంపీడీఓ రాధ, తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, చేవెళ్ళ ఏసీపీ స్వామి, శంకర్‌పల్లి సీఐ శశాంక్‌రెడ్డి, చేవెళ్ళ సీఐ గురవయ్యగౌడ్, ఎస్‌ఐలలు భీంకూమార్, శ్రీధర్‌రెడ్డి, రవికుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
గ్రామీణ ప్రాంతాలను నగరాలకు
దీటుగా తీర్చిదిద్దుతాం
తెలంగాణ రాష్ట్రంలోని రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామీణ ప్రాంతాలను నగరాలకు దీటుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం శంకర్‌పల్లిలో మార్కెట్‌లో 2 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామీణ ప్రాంతాలను నగరాలకు ధీటుగా తీర్చిదిద్దను న్నామన్నారు. హైదరాబాద్-బీజాపూర్ అంతర్ రాష్ట్ర రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేశామన్నారు. శంకర్‌పల్లిని నగర పంచాయతీగా ఏర్పాటు చేసి ముంబాయి-బెంగుళూరు జాతీయ రహదారులను కలిపేలా మరో రెండు లింక్ రోడ్ల నిర్మాణాలకు నిధులు అందిస్తామన్నారు. శంకర్‌పల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో రూ.50 కోట్లతో గోదాంల నిర్మాణం చేపట్టి రైతులకు ఆదుకుంటామన్నారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చిన ఘటన సీఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య, మండల అధ్యక్షులు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Comments

comments