Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం

int50 మందికి పైగా మృతి

త్రిభువన్ ఎయిర్‌పోర్టులో కూలిన బంగ్లా విమానం
ఇరాన్‌లో టర్కీ విమానం కూలి 11 మందికి పైగా మృతి

ఖాట్మండు/యుఎఇ: నేపాల్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (టిఐఎ)లో ఘోర ప్రమా దం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన యుఎస్‌బంగ్లా ఎయిర్‌లైన్స్ విమానం దిగుతుండగానే కుప్పకూలిపోవడమే కాకుండా నిప్పంటుకుం ది. నలుగురు విమాన సిబ్బంది, 67 మంది ప్రయాణికులతో ఢాకా నుంచి బయలుదేరిన విమానం మధ్యాహ్నం 2.20 గంటలకు రన్‌వేపై దిగుతున్నప్పుడు ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాద కారణంగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ విషయాన్ని టిఐఎ ప్రతినిధి ప్రేమ్‌నాథ్ ఠాకుర్ తెలిపారు. ‘ఈ ప్రమాదంలో 50 మందికిపైగా చనిపోయి ఉంటారని భావిస్తున్నాం. సహాయక చర్యలు చేపట్టాం. వివరాలను సేకరిస్తున్నాం’ అని టిఐఎ జనరల్ మేనేజర్ రాజ్‌కుమార్ ఛత్రీ తెలిపారు. గాయపడిన 20 మందిని చికిత్స నిమిత్తం ఖాట్మండు మెడికల్ కాలేజ్‌కు తరలించారు. విమానంలో ప్రయాణించినవారిలో కనీసం 17 మందిని రక్షించాం అని నేపాల్ పర్యాటక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సురేశ్ ఆచార్య చెప్పారు. విమాన ప్రమాదానికి సాంకేతిక సమస్యలు కారణం కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ‘విమానానికి కొటేశ్వర్ మీదుగా దక్షిణ దిక్కు రన్‌వేపై దిగడానికి అనుమతి ఇవ్వగా, అది ఉత్తర దిక్కు దిగడానికి యత్నించింది’ అని నేపాల్ పౌర విమాన ప్రాధికార సంస్థ డైరెక్టర్ జనరల్ సంజీవ్ గౌతం ‘ఖాట్మండు పోస్ట్’కు చెప్పారు. విమానం దిగేప్పుడు నియంత్రణ తప్పి ఉంటుంది. అందుకే అది అసాధారణరీతిలో దిగడానికి యత్నించి ఉంటుందని అనుమానిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇరాన్‌లో కూలిన టర్కీ విమానం: 11 మంది మృతి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ) నుంచి యువతుల బృందంతో ఇస్తాంబుల్‌కు బయలుదేరిన టర్కీ ప్రైవేట్ జెట్ విమానం ఆదివారం రాత్రి కూలిపోయింది. భారీ వర్షంలో ఆ విమానం ఇరాన్ కొండప్రాంతంలో కూలిపోగా అందులో ప్రయాణిస్తున్న 11 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన టర్కీ విమానం టెహరాన్‌కు 370 కిమీ. దూరంలో ఉన్న షహర్‌ఎ కొర్డ్ సమీపంలో పర్వతాన్ని ఢీకొని పేలిపోయిందని ఇరాన్ ప్రతినిధి మొజ్‌తబా ఖాలేది చెప్పారు.

Comments

comments