Search
Wednesday 20 June 2018
  • :
  • :

2 సీట్లు ఖాళీ

APASSEMBLY

అసెంబ్లీలో రెండు స్థానాలు ఖాళీ అయినట్లు ఎన్నికల సంఘానికి సమాచారం
గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల, కర్నాటక ఎన్నికలతోనే ఉపసమరం?

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెం దిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా ప్రభుత్వం మంగళవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రతులను జతపరుస్తూ రెండు శాసనసభ స్థానాలు ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం పంపిం ది. ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఈ రెండు స్థానాలకూ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఒక మంత్రి సూచనప్రాయంగా తెలియజేసిన కొన్ని గంటల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయడం, రెండు స్థానాలు ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నికల సం ఘానికి సమాచారం పంపడం గమనార్హం. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాత సభలో చోటు చేసుకున్న పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న అసెంబ్లీ స్పీకర్, ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు మిగిలిన 11 మంది సభ్యులను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. హెడ్‌ఫోన్‌లను విసిరివేసిన సంఘటనకు సంబంధించి వీడియో దృశ్యాలను, సిసిటివి ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన శాసనసభ అధికారులు మరో ఇద్దరు శాసనసభ్యుల ప్రమేయం కూడా ఉందన్న నిర్ధారణకు వచ్చారు. వారిపై కూడా సీరియస్ చర్యలు ఉండవచ్చని ప్రభుత్వవర్గాల సమాచారం. బుధవారం సమావేశాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Comments

comments