Search
Wednesday 20 June 2018
  • :
  • :

అక్కినేని హీరోలకు స్పెషల్‌గా ఉగాది

nag

అక్కినేని హీరోలు ఈ ఉగాది నుంచి బాగా బిజీ కానున్నారు. తెలుగు సంవత్సరాదిన తమ కొత్త సినిమాలతో పండుగ చేసుకోబోతున్నారు. నాగార్జునతో పాటు ఆయన ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్‌కు ఈ ఉగాది ఎంతో స్పెషల్‌గా మారనుంది. నాగార్జున ప్రస్తుతం రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆఫీసర్’ సినిమాలో నటిస్తున్నాడు. గత నెల రోజులకు పైగా ముంబయ్‌లో ఉంటూ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ఈ ఉగాదిలోపు హైదరాబాద్‌కు వచ్చేయనున్నాడు నాగార్జున. ఉగాది రోజున నానీతో కలిసి తాను చేయబోయే మల్టీస్టారర్ సినిమాను ఆయన మొదలుపెట్టబోతున్నాడు. ఇక నాగచైతన్య ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న చైతన్య చిత్రం ‘సవ్యసాచి’ ఫస్ట్‌లుక్‌ను ఉగాది రోజునే విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అతని లుక్ ఎలా ఉంటుందో ఉగాది రోజే తెలిసిపోతుంది. ఇక నాగార్జున చిన్న కొడుకు అఖిల్ తన మూడవ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ‘తొలిప్రేమ’తో మంచి హిట్‌ను అందుకున్న  వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. అఖిల్‌తో అతను ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను తీయబోతున్నాడు. ఉగాది రోజున ఈ సినిమాను ఓకే చేయబోతున్నారు. బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తాడు. ఈవిధంగా ముగ్గురు అక్కినేని హీరోలకు ఈ  ఉగాది ఎంతో స్పెషల్‌గా మారనుంది.

Comments

comments