Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

ఈ చెట్టు నీ(డ)ళ్లూ ఇస్తుంది..!(వీడియో)

Water-is-Gushing-from-an-Ol

సామాన్యంగా చెట్లకి పూలు పూస్తుంటాయి. పండ్లు, కాయలు కాస్తాయని తెలుసు. అయితే మరి ఇప్పుడు చదవబోతున్న చెట్టులో నుంచి నీళ్లొస్తాయని ఎప్పుడైనా, ఎక్కడైనా చూసారా…  అది కూడా మాములుగా కాదు బోరు బావిలో నుంచి ఎలాగైతే వస్తాయో అచ్చం అలాగే వస్తాయి.  ఐరోపా ఖండంలోని మోంటెనాగ్రో అనే ఒక చిన్న దేశంలో డినోసా అనే చిన్న గ్రామంలో ఈ వింత చెట్టు ఉంది. దీన్ని మల్బరీ వృక్షం అంటారు. ఇది  కొన్ని వందల  ఏళ్లనాటిదని స్థానికుల అభిప్రాయం. వర్షం కురిసి తగ్గిన వెంటనే చెట్టు నుంచి ఇలా ఫౌంటేన్‌లా నీరు పొంగి పొర్లుతుంది. దాంతో ఆ చుట్టుపక్కల మొత్తం మునిగిపోయేంతలా.  అంతేకాకుండా ఈ చెట్టు నుంచి వచ్చిన నీటితో ఇక్కడో చిన్న నీటి కాలువ ఏర్పడి ప్రవహించేస్తుందంటే ఎంత నీరు వస్తుందనేది మనం గమనించవచ్చు. కొన్నాళ్లకు మళ్లీ ఈ నీరు ఆగిపోతుంది. దీంతో  ఈ వింతను చూడటానికి  చుట్టుపక్కల నుంచి ప్రజలు వస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఈ వింతను వీడియో తీసి సోషల్ మీడియాలో  పోస్ట్ చేశారు కొందరు. దీంతో దీన్ని చూసిన వారితో పాటు ప్రపంచమంతా ఆశ్చర్యపడుతున్నారు. అసలు ఇదెలా సాధ్యమయ్యిందో తెలుసుకుందాం… ఇక్కడి  చుట్టుపక్కల  నీటి బుగ్గలు ఉన్నాయి. దీంతో అక్కడ వర్షాలు పడితే భూగర్భంలో నీటి మట్టం పెరుగుతుంది.   చుట్టుపక్కల బుగ్గల నుంచి నీరు ఉబికి పైకి వస్తుంటుంది. ఈ మల్బరీ చెట్టు కిందా ఇలాంటి బుగ్గే ఉందట. పెద్ద కాండం ఉన్న ఈ చెట్టు  లోపలి నుంచి ఓ రంధ్రం ఉంది. భూగర్భంలో నీరు ఎక్కువైపోతే దానిలో ఒత్తిడి ఏర్పడి ఆ నీరు ఇలా ఫౌంటేన్‌లా మారి బయటకొచ్చేస్తుందని దీనిపై పరిశోధనలు జరిపిన  పరిశోధకులు చెబుతున్నారు.

 

Comments

comments