Search
Wednesday 20 June 2018
  • :
  • :

రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

ph
హైదరాబాద్: ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ అభ్యర్థి బడుగుల లింగయ్య, యాదవ, కురుమ సంఘం ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ రాజ్యసభ అభర్థిగా బడుగు లింగయ్య యాదవ్‌ను ప్రకటించడంపై సిఎం కెసిఆర్‌కు వాళ్లంతా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బుడుగుల లింగయ్యను సిఎం అభినందించారు. ఇచ్చిన మాట ప్రకారం యాదవులకు రాజ్యసభలో సీటు ఇచ్చామని సిఎం అన్నారు. యాదవ, కురుమ సామాజిక వర్గానికి చెందిన వారు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సిఎం ఆకాంక్షించారు. త్వరలోనే కురుములకు ఒక ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వనున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 మంది గొల్లకురుములకు డైరెక్టర్ల లాంటి నామినేటెడ్ పదవులు ఇస్తామని సిఎం తెలిపారు.

Comments

comments