Search
Friday 20 April 2018
  • :
  • :

బాబు దీక్షను ఎవరూ నమ్మరు: విజయసాయిరెడ్డి

Vijaya-sai-Reddy

అమరావతి:  ప్రత్యేక హోదా విషయంలో ఎపి సిఎం చంద్రబాబునాయుడు ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని రాజ్యసభ ఎంపి విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ లో బంద్ కొనసాగుతుంది. ధర్నాలో పాల్గొన్న విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…. బాబు దీక్షల పేరుతో ఎవరినీ మోసం చేయలేరని దుయ్యబట్టారు. హోదాపై బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆమరణ దీక్ష చేయాలని సవాలు విసిరారు. అవిశ్వాసాన్ని అడ్డుకుని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. మోడీ బాటలోనే బాబు నడుస్తున్నారని, బాబు దీక్షను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

Comments

comments