Search
Friday 20 April 2018
  • :
  • :

మారిషస్‌లో ఎపి మెడికో మృతి

MANOJ

ప్రకాశం : ప్రకాశం జిల్లాకు చెందిన సాయి మనోజ్ అనే వైద్య విద్యార్థి మారిషస్‌లో మృతి చెందాడు. మద్దిపాడు మండలం అన్నంగి గ్రామానికి చెందిన సాయి మనోజ్ మారిషస్‌లోని అన్నా మెడికల్ అండ్ సైన్సెస్‌లో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం తన స్నేహితులతో కలిసి ఓ జలపాతాన్ని చూసేందుకు మనోజ్ వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయినట్లు కాలేజీ యాజమాన్యం మనోజ్ తల్లిదండ్రులైన వెంకటస్వామి, రమాదేవిలకు సమాచారం ఇచ్చారు. మనోజ్ తొలుత వెంటిలేటర్‌పై ఉన్నాడని సమాచారం ఇచ్చిన కాలేజీ యాజమాన్యం సోమవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో చనిపోయాడని సమాచారం ఇచ్చిందని వారు తెలిపారు. మనోజ్ ఏకైక సంతాపం కావడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. మనోజ్ మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు అధికారులు సహకరించాలని మనోజ్ బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.

AP Medico Died in Mauritius

Comments

comments