Search
Friday 20 April 2018
  • :
  • :

బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి..!

Beautician Died in a Suspicious in Vikarabad

వికారాబాద్: ఓ బ్యూటీషియన్ అనుమానాస్పదిస్థితిలో మృతి చెందిన ఘటనలింగంపల్లిలోని గ్రీన్ ట్రెండ్స్‌లో చోటుచేసుకుంది. బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న జ్యోతి అనే యువతి తాండూరులోని అమ్మమ్మ వాళ్లింటి జాతరకని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అయితే అనుమానాస్పదస్థితిలో వికారాబాద్‌లో శవమై తేలింది. దారుర్ మండలం తరిగోపుల రైల్వే స్టేషన్‌లో రాత్రి 11 గంల ప్రాంతంలో బీజాపూర్ ట్రైన్ నుంచి ఆమె కిందపడిపోయిందని తెలుస్తోంది. యువతి మొబైల్ మైలారం సమీపంలో దొరికినట్లు సమాచారం. యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే యువతిది హత్యా? ఆత్మహత్యా? లేక ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడిపోయిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

comments