Search
Tuesday 19 June 2018
  • :
  • :

‘భరత్ అనే నేను’ సెన్సార్ పూర్తి…

Bharat Ane Nenu Censor Completed then get U/A Certificate

హైదరాబాద్: కొరటాల శివ, సూపర్‌స్టార్ మహేష్‌బాబు కాంబోలో వస్తున్న మూవీ ‘భరత్ అనే నేను’. ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతున్న భరత్ సెన్సార్ కార్యక్రమాలు సోమవారం జరిగాయి. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. సెన్సార్ సభ్యులు ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయకుండా జీరో కట్స్‌తో ఈ మూవీకి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేయడం విశేషం. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో అభిమానుల్లో భరత్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా శ్రోతులను అలరిస్తోంది. దీంతో మూవీ విడుదల కోసం సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కొరటాల, మహేష్ కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన శ్రీమంతుడు సినిమా ఘనవిజయం సాధించడంతో ‘భరత్‌’పై ప్రిన్స్ అభిమానుల భారీ ఆశలే పెట్టుకున్నారు. మహేష్ కూడా భరత్ తనకు భారీ హిట్ అందించడం ఖాయమని ఆడియో వేడుకలో చెప్పిన సంగతి తెలిసిందే.

Comments

comments