Search
Friday 20 April 2018
  • :
  • :

అరుణ్‌జైట్లీ ట్వీట్‌పై కౌంటర్‌ ఇచ్చిన కెటిఆర్‌

Ktr-image

హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పై తెలంగాణ మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సరిపడినంత మొత్తంలో నగదు బ్యాంకుల వద్ద చలామణిలో ఉందని అరుణ్ జైట్లీ ట్వీట్ చేసిన విషయం విదితమే.. ఆర్ధిక మంత్రి ట్వీట్ పై తెలంగాణ మంత్రి స్పందిస్తూ…  బ్యాంకుల్లోనూ, ఎటిఎంలలోనూ ఏర్పాడిన నగదు కొరత అకస్మాత్తుగా జరగలేదని, అది పాక్షికమైన కొరత కాదని ఐటి మంత్రి మంగళవారం ట్వీట్టర్ వేదికగా తెలియజేశారు. హైదరాబాద్ లో దాదాపు మూడు నెలల నుంచి నగదు కొరతపై ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను విచ్ఛిన్నం చేయవద్దని ఆయన హితవు పలికారు. నగదు కొరతపై ఆర్ బిఐ, కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధికారులకు చర్చించి నగదు సమస్యను పరిష్కరించాలని కెటిఆర్ కోరారు.

Comments

comments