Search
Friday 20 April 2018
  • :
  • :

తెలంగాణలో నిరంకుశ పాలన : జానారెడ్డి

K.JANAREDDY

హైదరాబాద్ : తెలంగాణలో కెసిఆర్ నిరంకుశ పాలన చేస్తున్నారని సిఎల్‌పి నేత కుందూరు జానారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసి కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చారని ఆయన ధ్వజమెత్తారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయని, ఆ లొసుగులపై చర్చ లేకుండా చేశారని మండిపడ్డారు. ఒక పార్టీ సభ పెట్టుకునేందుకు కూడా టిఆర్‌ఎస్ సర్కార్ అనుమతి ఇవ్వడం లేదన్నారు. తమ పార్టీ ఎంఎల్‌ఎలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాల రద్దు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమన్నారు. వారి సభ్యత్వాలను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. తమ ఎంఎల్‌ఎలకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడం కెసిఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు.

CLP Leader Jana Reddy Comments on KCR Ruling

Comments

comments