Search
Friday 20 April 2018
  • :
  • :

మోడీతో కెసిఆర్ లోపాయికారి ఒప్పందం : నారాయణ

Narayana

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీతో తెలంగాణ సిఎం కెసిఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని సిపిఐ అగ్రనేత నారాయణ ఆరోపించారు. ఈ క్రమంలోనే మోడీని కాపాడేందుకు కెసిఆర్ కృషి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కెసిఆర్‌కు నార్కో టెస్ట్‌లు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన హామీల అమలులో కేంద్రం విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నేతలు సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ధర్నాకు దిగిన సిపిఐ నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

CPI Leader Narayana Comments on CM KCR

Comments

comments