Search
Friday 20 April 2018
  • :
  • :

వరంగల్ మాస్టర్ ప్లాన్‌పై కడియం సమీక్ష

KADIYAM

వరంగల్ : వరంగల్ జిల్లా నూతన మాస్టర్ ప్లాన్‌పై తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం సమీక్ష చేశారు. హన్మకొండలోని కూడా కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో నగర మేయర్ నన్నపునేని నరేందర్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, ఎంఎల్‌ఎలు వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కలెక్టర్ ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాకు కొత్త మాస్టర్‌ప్లాన్ సిద్ధమవుతుందని ఈ సందర్భంగా కడియం శ్రీహరి తెలిపారు. 43ఏళ్ల తరువాత మాస్టర్‌ప్లాన్ రివైజ్ చేస్తున్నామని, వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన చేస్తున్నామని ఆయన చెప్పారు. వరంగల్ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.

DCM Kadiyam Srihari Review on Warangal Master Plan

Comments

comments