Search
Friday 20 April 2018
  • :
  • :

డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పోలీసులకు చేదు అనుభవం..!

Mother-and-Sonహైదరాబాద్: నగరంలో డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు చేసే పోలీసులు ఒక్కోసారి మందు బాబులను కట్టడి చేసేందుకు నానా తంటాలు పడుతుంటారు. తాగిన మత్తులో పోలీసులపై దాడికి కూడా వెనకాడరు వాహనదారులు. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. కానీ ఈ నెల 11న రాత్రి  రాజేంద్రనగర్‌లో డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీల్లో ఉన్న పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. తనిఖీల్లో భాగంగా ఓ వాహనదారుడిని పోలీసులు పరీక్షలు  నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అటుగా నడుచుకుంటూ వచ్చిన ఓ తల్లీ, కొడుకు పోలీసులపై తిట్ల పురాణం అందుకున్నారు. ఇక్కడి ఆరాంఘర్ చౌరస్తాలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తుంటే, శంషాబాద్ మండలానికి చెందిన చెన్నమ్మ, ఆమె కుమారుడు శ్రీశైలం అటుగా వచ్చారు. పోలీసులను చూసిన వీరు “మా డబ్బుతో మేము తాగుతుంటే మీకేంటి?” అంటూ రెచ్చిపోయారు. పోలీసులు ఎంత చెప్పినా వినలేదు. వీరిద్దరూ మద్యం మత్తులోనే ఉండటంతో అప్పటికి చేసేదేమీ లేక వారిని పంపించివేసిన పోలీసులు, సోమవారం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Comments

comments