Search
Friday 20 April 2018
  • :
  • :

బ్యాంకుల వద్ద సరిపోను నగదు : జైట్లీ

Arun-Jaitley

ఢిల్లీ : బ్యాంకుల వద్ద సరిపోను నగదు ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. దేశ వ్యాప్తంగా నగదు కొరత ఏర్పడిన విషయంపై ఆయన స్పందించారు. ప్రస్తుతం అవసరం కన్నా ఎక్కువ నగదు చెలామణిలో ఉందని ఆయన చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో అనూహ్యంగా డిమాండ్ ఏర్పడడంతో పాక్షికంగా నగదు కొరత ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. నగదు కొరత ఏర్పడిన ప్రాంతాల్లో నగదును అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ళో నగదు కొరత తీవ్రంగా ఉందని ఆ రాష్ట్ర సిఎం రమణ్‌సింగ్ తెలిపారు. నగదు కొరతను తీర్చేందుకు చర్యలు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు.

Enough Cash at Banks : Jaitley

Comments

comments