Search
Friday 20 April 2018
  • :
  • :

నేపాల్‌లో ఇండియన్‌ ఎంబసీ వద్ద పేలుడు

Explosion Near Indian Embassy In Nepal Today

ఖట్మాండు: నేపాల్‌ రాజధాని ఖట్మాండులో మంగళవారం ఉదయం స్వల్ప పేలుడు సంభవించింది. బిరత్‌నగర్‌ ప్రాంతంలోని ఇండియన్‌ ఎంబసీ సమీపంలో పేలుడు చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రత స్వల్పమే అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా రాయబార కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళవారం ఉదయం సుమారు 8:20 గంటల ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి కార్యాలయం ప్రహారీ గోడ ధ్వంసమైన్నట్లు నేపాల్‌ పోలీసులు తెలిపారు.

Comments

comments