Search
Friday 20 April 2018
  • :
  • :

నదిలో పడి భారతీయుల మృతి

SANDEEP

వాషింగ్టన్ : అమెరికాలో ఉంటున్న భారత సంతతి కుటుంబం కాలిఫోర్నియాలోని ఓ నదిలో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన పది రోజుల క్రితం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు నదిలో పడడంతో ఈ ఘటన జరిగింది. నాటి నుంచి వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. సోమవారం ఇద్దరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మృతదేహాలు సందీప్ తోటపిల్లి (41), ఆయన కుమార్తె సాచి (9)గా గుర్తించారు. గత వారం సందీప్ భార్య సౌమ్య (38) మృతదేహాన్ని నది నుంచి వెలికి తీశారు. సందీప్ కొడుకు సిద్ధాంత్ (12) ఆచూకీ ఇంకా తెలియరాలేదు. నదిలో ఆరు అడుగుల లోతులో కారు పడిపోయి ఉందని పోలీసులు చెప్పారు. సందీప్, సాచిల మృతదేహాలు హోండా పైలట్ కారులోనే చిక్కుకుని ఉండడంతో బయటకు తీశారు. నదిలో ఓ ప్రాంతం నుంచి పెట్రోల్ వాసన వస్తుండడంతో తనిఖీ చేయగా, ఈ ఘటన వెలుగు చూసింది. భారత్‌లోని గుజరాత్‌కు చెందిన సందీప్ 15ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సందీప్ కుటుంబ సభ్యుల మరణ వార్త విని గుజరాత్‌లోని ఆయన బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Four Indians drowned in River and Died at California

Comments

comments