Search
Friday 20 April 2018
  • :
  • :

తెలంగాణ జన సమితి సభకు అనుమతి

Kodandaram Meet with Nayini Narasimha Reddy

హైదరాబాద్ : తెలంగాణ జన సమితి సభకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 29న సరూర్‌నగర్ గ్రౌండ్‌లో తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభను నిర్వహించనుంది. సభ కోసం పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు సభకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. సభకు మూడు రోజుల్లోగా అనుమతి ఇవ్వాలని పోలీసులకు కోర్టు సూచించింది. టిజెఎసి చైర్మన్ కోదండరామ్ నేతృత్వంలో తెలంగాణ జన సమితి పార్టీ ఏర్పాటు కానుంది. సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. సభను విజయవంతం చేసేందుకు కోదండరామ్ తెలంగాణ జిల్లాల్లో పర్యటించారు.

High Court Give Permission to Telangana Jana Samithi Meeting

Comments

comments