Search
Friday 20 April 2018
  • :
  • :

అమ్మతో ఉన్న ఈ బుల్లి హీరో ఎవరో చెప్పుకోండి చూద్దాం?

Identify the Tollywood Top Hero in the above Photo

హైదరాబాద్: అమ్మతో కలిసి అమాయకపు చూపులు చూస్తున్న ఫోటోలోని బుడతడు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. తనకంటూ ప్రత్యేక అభిమాన గణాన్ని సంపాదించుకుని దూసుకుపోతున్నారు ఈ హీరో. ఆయన డ్యాన్స్, యాక్షన్ ప్రత్యేక శైలిలో ఉంటూ సినీ అభిమానులను అలరిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఆయన నందమూరి ఫ్యామిలీకి చెందిన వాడు. ఇప్పుడు గుర్తొచ్చాడా?.. లేదా? అయితే మేం చెబుతాం. అతను ఎవరో కాదు యంగ్‌టైగర్ ఎన్‌టిఆర్. చిన్నతనంలో తల్లి శాలినితో కలిసి దిగిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ అరుదైన ఫోటోను చూసి తారక్ అభిమానులు మురిసిపోతున్నారు. ఇక ఎన్‌టిఆర్ ప్రస్తుతం మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. త్రివిక్రమ్ మూవీ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్‌తో కలిసి భారీ మల్టీస్టారర్ చిత్రంలో నటించనున్నాడు.

Comments

comments