Search
Friday 20 April 2018
  • :
  • :

అమెరికా కరెన్సీ నిఘాలో భారత్

mony

వాషింగ్టన్: కరెన్సీ, స్థూల ఆర్థిక విధానాల పర్యవేక్షణ జాబితాలో భారత్‌ను కూడా అమెరికా చేర్చింది. అవసరం లేకున్నా భారత్ 2017 తొలి మూడు త్రైమాసికాల్లో విదేశీ మారకాన్ని ఎక్కువగా కొనుగోలు చేసిందని పేర్కొంది. ఇప్పటికే ఈ నిఘా జాబితాలో ఉన్న చైనా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, స్విట్జర్లాండ్ సరసన ఆరో దేశంగా భారత్‌ను చేర్చింది. ‘2017 తొలి మూడు త్రైమాసికాల్లో భారత్ విదేశీ మారకం కొనుగోలును పెంచేసింది. నాలుగో త్రైమాసికంలో ఈ కొనుగోళ్లు కొంత మేరకు తగ్గినప్పటికీ 2017లో భారత్ వార్షిక విదేశీ మారక కొనగోలు 56 వందల కోట్ల డాలర్లకు చేరింది. ఇది స్థూల జాతీయోత్పత్తి(జిడిపి)లో 2.2 శాతానికి సమానం’ అని అమెరికా కోశాగార శాఖ అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన తన సెమీ వార్షిక నివేదికలో పేర్కొంది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, పోర్ట్‌ఫోలియో పెట్టుబడి ద్వారా విదేశీ మారక ప్రవాహం బాగా పెరిగినప్పటికీ విదేశీ మారకాన్ని భారత్ అధిక మొత్తంలో కొనుగోలు చేసిందన్నది. ఎంతగా కలుగజేసుకున్నప్పటికీ రూపాయి విలువ డాలరుకు ఆరు రెట్లు పెరిగింది. ఇది 2017 వాస్తవిక ప్రభావం ఆధారంగా ఉండే 3 శాతం కన్నా ఎక్కువ అని పేర్కొంది.
అమెరికాతో చేసే ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్‌కు గణనీయ మిగులుందని ట్రెజరీ, కాంగ్రెస్‌కు తెలిపింది. మొత్తంగా ఆ ద్వైపాక్షిక వాణిజ్యం 2300 కోట్ల డాలర్లుగా ఉంది. అమెరికా ట్రెజరీ ప్రకారం భారత 2017 కరెంట్ అకౌంట్ లోటు జాతీయోత్పత్తిలో 1.5 శాతం పెరిగింది. అయితే మారక రేటును అంతర్జాతీయ ద్రవ్య నిధి ద్వారా తక్కువ విలువగా నిర్ధారించబడలేదు.
విదేశీ కరెన్సీ కొనుగోలును అమెరికా ట్రెజరీ గణిస్తుంది. పదేపదే విదేశీ మారక కొనుగోలుకు యత్నించడం, దాంతో స్థూల జాతీయోత్పత్తిలో 2 శాతం అధికం కావడం అనేది ఒక తరఫు జోక్యమవుతుంది అని ట్రెజరీ తన నివేదికలో పేర్కొంది. అమెరికాతో జరిగిన వస్తువుల వాణిజ్యంలో భారత్ 2300 కోట్ల డాలర్ల మిగులుతో ఉందని, ఇది రికార్డు స్థాయి పెరుగుదల అని కూడా అమెరికా కోశాగార శాఖ తన నివేదికలో పేర్కొంది. అమెరికాతో భారత్ సేవల మిగులు కూడా 600 డాలర్లు ఉంది.

Comments

comments