Search
Friday 20 April 2018
  • :
  • :

కళ్యాణ్‌రామ్‌కు జోడీగా నివేద, షాలిని

niveda

హిట్ మూవీ ‘ఎంఎల్‌ఎ’ చిత్రం కళ్యాణ్‌రామ్ కెరీర్‌కు మంచి ఊపునిచ్చింది. ప్రస్తుతం అతని చిత్రం ‘నా నువ్వే’ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే కళ్యాణ్‌రామ్ మరో సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడు. ‘నా నువ్వే’ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయిన ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ సోలోగా నిర్మించే సినిమాకు ఆయన ఓకే చెప్పాడు. ఇప్పటివరకు సినిమాటోగ్రాఫర్‌గా ఉన్న గుహన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆయన వినిపించిన సబ్జెక్ట్ కళ్యాణ్‌రామ్‌కు ఎంతగానో నచ్చింది. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. కథానాయికలుగా యంగ్ బ్యూటీలు నివేదా థామస్, షాలినీ పాండేలను ఎంపికచేశారు. ‘నిన్ను కోరి’ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది నివేద. మంచి నటిగా నిరూపించుకున్న ఆమెకు ఈ సినిమా ఓ మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇక ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో షాలినీ పాండేకు హీరోయిన్‌గా మంచి క్రేజ్ వచ్చింది. ఈ చిత్రంలో ఈ భామ విజయ్‌దేవరకొండతో చేసిన హాట్ సీన్లు యూత్‌ను మురిపించాయి. ఆమె ప్రస్తుతం నిఖిల్‌తో ‘ముద్ర’ సినిమా చేస్తోంది. ఇప్పుడు షాలిని.. కళ్యాణ్‌రామ్ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది.

Comments

comments