Search
Friday 20 April 2018
  • :
  • :

షమీకి సమన్లు…

Mohammed Shami Wife Hasin Jahan Meet Delhi Daredevils CEO

కోల్‌కతా: భారత మీడియం పేసర్ మహ్మద్ షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షమీకి కోల్‌కతా పోలీసులు మంగళవారం సమన్లు జారీ చేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. హసీన్ ఫిర్యాదు మేరకు షమీపై పోలీసులు గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే షమీకి సమన్లు ఇచ్చారు. ఇటీవల తనకు, కూతురికి కలిపి నెలకు రూ. 10 లక్షలు ఇవ్వాలని జహాన్ కోర్టులో పిటిషన్ వేసింది. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం ఈ కేసును తక్షణమే విచారించాలని కోల్‌కతా పోలీసులను ఆదేశించింది.

Comments

comments