Search
Friday 20 April 2018
  • :
  • :

మక్కామసీదు కేసు కొట్టివేత

Mecca Masjid Blast Case is Dismissed by Nampally Court

హైదరాబాద్: 2007 మే18న జరిగిన మక్కామసీదు పేలుళ్ల కేసును దాదాపు 11 ఏళ్లు విచారించిన ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు సోమవారం కొట్టివేసింది. నిందితులపై నేరారోపణలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో ఐదుగురు నిందితులను కోర్టు నిర్ధోషులుగా తేల్చింది. ఏ ఒక్కరిపైనా కూడా అభియోగాలు రుజువు కాలేదని న్యాయవాది పేర్కొన్నారు. అందుకే ఐదుగురు నిందితులపై కేసు కొట్టివేయడమైందని తెలిపారు. మిగతా నిందితులపై ఛార్జ్‌షీట్ కొనసాగుతుందన్నారు. నిందితులుగా ఉన్న దేవేందర్‌గుప్తా, లోకేశ్‌ శర్మ, స్వామి అసీమానంద, భరత్‌ భాయి, రాజేందర్‌చౌదరిపై అభియోగాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రత్యేక న్యాయస్థానం తీర్పుపై ఎన్‌ఐఎ, హైక్టోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Comments

comments