Search
Friday 20 April 2018
  • :
  • :

‘మెహబూబా’తో పూరి మ్యాజిక్ మళ్లీ మొదలవుతుంది

mehabuba

పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ పూరీని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై నేహా శెట్టి హీరోయిన్‌గా రూపొందించిన చిత్రం ‘మెహబూబా’. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో జరిగే లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా చూసిన దిల్‌రాజు చాలా బాగుందని ప్రశంసించారు. ఇక పూరి సంగీత్ ద్వారా ఈ చిత్రంలోని పాటలు రిలీజ్ కానున్నాయి. శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ అధినేత దిల్‌రాజు మే 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు మాట్లాడుతూ “2002లో ‘ఇడియట్’ సినిమాతో పూరి జగన్నాథ్‌తో అసోసియేట్ అయ్యాను. ఇక పవన్‌కల్యాన్‌తో ‘బద్రి’, మహేష్‌బాబుతో ‘పోకిరి’, ప్రభాస్‌తో ‘బుజ్జిగాడు’, ఎన్టీఆర్‌తో ‘టెంపర్’, రామ్‌చరణ్‌తో ‘చిరుత’, బన్నీతో ‘దేశముదురు’, రవితేజతో ‘ఇడియట్’ సినిమాలు తీసి సూపర్‌హిట్స్ కొట్టాడు పూరి జగన్నాథ్. ఆయన తన హీరోలకు సపరేట్ క్యారెక్టర్‌ని సృష్టించి సినిమాలు చేస్తారు. అద్భుతమైన దర్శకుడు ఆయన. ఈ సినిమా టీజర్ చూశాను… చాలా బాగుంది. పూరి జగన్నాథ్, ఛార్మి నా కోసం ఈ సినిమా షో వేశారు. ఫస్ట్‌హాఫ్ చూశాక సినిమా చాలా బాగుంది అన్నాను. ప్రీ క్లైమాక్స్‌లో కరెంట్ పోయింది. అప్పుడు పూరి ల్యాప్‌ట్యాప్‌లో క్లైమాక్స్ చూశాను… అదిరిపోయింది. బయటకు వచ్చాక అందరికీ ‘మెహబూబా’ బాగుందని చెబుతున్నాను. పూరి మ్యాజిక్ మళ్లీ ఈ సినిమాతో మొదలవుతుంది. 1971లో ఇండియా-పాకిస్తాన్ యుద్ధం కథాంశంతో 2018కి తగ్గకుండా రెండు స్టోరీలకు మిక్స్ చేసి అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ‘మెహబూబా’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆకాశ్, నేహా సూపర్బ్‌గా నటించారు. ఈ సినిమాతో ఇద్దరూ మంచి ఆర్టిస్టులుగా పేరు తెచ్చుకుంటారు. ఈ చిత్రాన్ని మే 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం”అని అన్నారు. హీరో ఆకాశ్ పూరి మాట్లాడుతూ “డాడీ స్టోరీ చెప్పారు. నాకు బాగా నచ్చింది. ఎంతో నమ్మకంగా ఈ సినిమా చేశాం. సినిమా టీజర్, ట్రైలర్‌కు మేం ఆశించిన దానికన్నా రెండింతల స్పందన వచ్చింది.  దిల్‌రాజు సినిమా చూసి చాలా బాగుందని చెప్పాక మా నమ్మకం పదింతలు అయ్యింది. ఆయన మా సినిమా రిలీజ్ చేస్తున్నారు అనగానే నీ సినిమా సూపర్‌హిట్ అని ప్రతి ఒక్కరూ కంగ్రాట్స్  చెబుతున్నారు”అని తెలిపారు. పూరి కనెక్ట్‌లో ఒకరైన ఛార్మి కౌర్ మాట్లాడుతూ “పూరి చాలా క్లారిటీగా స్క్రిప్ట్ రాస్తారు. విజువల్స్, డైలాగ్స్ ప్రతీది సినిమా చూసినట్టు చెబుతారు. సినిమాలో ఆకాష్, నేహా చక్కగా నటించారు. స్పెషల్‌గా యాక్షన్ సీన్స్, వార్, ఛేజ్  సీన్‌లలో ఆకాష్ ధైర్యంగా నటించాడు. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘ఓ ప్రియా… నా ప్రియా’ సాంగ్‌ను ఈనెల 16న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నాం”అని పేర్కొన్నారు. హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ “తెలుగులో ఇది నా తొలి చిత్రం. సినిమాలో ఒక మంచి క్యారెక్టర్‌లో నటించాను. ఛార్మి ఎంతగానో ప్రోత్సహించారు. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ. ఆకాష్ అద్భుతంగా నటించాడు”అని అన్నారు. ఈ సమావేశంలో కెమెరామెన్ విష్ణుశర్మ, ఆర్ట్ డైరెక్టర్ జానీ షేక్, ఎడిటర్ జునైద్ సిద్దిఖీ, ఫైట్ మాస్టర్ రియల్ సతీష్  తదితరులు పాల్గొన్నారు.

Comments

comments