Search
Friday 20 April 2018
  • :
  • :

మొజాంజాహి మార్కెట్‌ను పరిశీలించిన కెటిఆర్

KTR

హైదరాబాద్ : నగరంలోని మొజాంజాహి మార్కెట్‌ను మంత్రి కెటిఆర్ సోమవారం పరిశీలించారు. మార్కెట్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, మార్కెట్‌లో చేపట్టాల్సిన పనులపై ఆయన అధికారులతో సమీక్ష చేశారు. ఈ మార్కెట్‌ను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దత్తత తీసుకున్నారు. పది కోట్ల నిధులతో మార్కెట్ పునరుద్ధరణ పనులకు జిహెచ్‌ఎంసి ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో కెటిఆర్ మార్కెట్‌ను పరిశీలించారు. మార్కెట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన అధికారులకు వివరించారు.

Minister KTR Visit the Mozamjahi Market

Comments

comments