Search
Friday 20 April 2018
  • :
  • :

బీమాలేని వాహనాలు 45 శాతం పైనే

మొదటి సంవత్సరం మీదే దృష్టి, ఆనంతరం పట్టించుకోని వాహన దారులు, నగరంలో నామ మాత్రంగా సాగుతున్న తనిఖీలు, జరిమానాతో సరిపెడుతన్న అధికారులు

Traffic-channel

మన తెలంగాణ/సిటీబ్యూరో: ప్రతి బీమా చే యించాలి. ప్రమాద సమయంలో అదే అండగా ఉంటుంది. మోటారు వాహనాల చట్టంలోనూ ప్రతి వాహనానికి బీ మా తప్పని సరిగా ఉండాలని ఉంది. ప్రతి సం వత్సరం బీమా పునరుద్ధరించుకుంటూ ఉండాలి లేకపోతే. వాహనాలకు జరిమానా విధించే అవకాశం వుంటుంది. ఉంటుంది. ద్విచక్ర వా హనాలకు రూ.100 ఇతర వాహనాలన్నీంటికి రూ.500 వరకు జరిమానా విధించవచ్చు. ఇలా ఎన్నో ని బంధనలు అమల్లో ఉన్నా బీమా విషయంలో వాహన యజమానులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

వేలు, లక్షలు ఖర్చుచేసి మరీ వాహనాలను కొనుగోలు చేస్తున్న వారు బీమా విషయంలో మాత్రం నిర్లక్షం గా వ్యవహరిస్తున్నారు. వాహనాలకు బీమా చేయి స్తే అది ఎన్నో విధాలుగా రక్షణ ఉంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడు అది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాని ఈ విషయాన్ని వాహనదారులు ఏ మాత్రం గుర్తించడం లేదు. నగరంలో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో వాహనాలు పెరిగిపోతున్నాయి. వాహన కొనుగోలు సమయంలో బీమా ఉంటుంది. ఆ తర్వాత నుంచి వాహనదారుల ఇష్టంగా మారింది. నగరంలో తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలు ఆందోళన కల్గిస్తున్నా వాహన దారులు నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మోటారు వాహనాల చట్టం ప్రకారం నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరగవని రవాణా శాఖ అధికారు లు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌లోని రోడ్లపై వివిధ రకా ల వాహనాలు తిరుగుతున్నాయి. వీటిలో రవాణా, వ్యక్తిగత వాహనాలు ఉన్నాయి. రవాణా వాహనాలకు ప్రతి సంవత్సరం సామర్థ పరీక్షలు నిర్వహించే సమయంలో బీమా చేయించినట్లు చూపించాలి. అవి ఉంటేనే రవాణాశాఖ అధికారులు సామ ర్థ పరీక్షలు నిర్వహిస్తారు. వ్యక్తిగత వాహనాలకు సామర్థ పరీక్షలు అవసరం లేకపోవడం తో వారు బీమా విషయంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు.

దీనిపై అవగాహన ఉన్న యజమానులు మాత్రం క్ర మం తప్పకుండా బీమాను పునరుద్ధరించుకుంటున్నారు. ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలకు బీమా చేయించుకునే విషయంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. నగరంలో తిరిగే ద్విచక్ర వాహనాల్లో 45 శాతం బీమా లేదని గుర్తించారు. సాధారణంగా కొత్త వాహనాల కొనుగోలు సమయంలోనే బీమా తప్పని సరిగా తీసుకోవాలి లేదంటే రిజిస్ట్రేషన్ కాదు. దీంతో తప్పని సరిగా పరిస్థితుల్లో బీమా తీసుకుంటున్న వాహనదారులు అనంతరం దాన్ని కొనసాగిచండలేదు.

వాహనాలకు కాంప్రెన్సివ్, థర్డ్‌పార్టీ, పబ్లిక్ లయబుల్టీ, పేర్లతో మూడు రకాలు బీమా తీసుకోవచ్చు. సుమారు 30 కంపెనీలు ఇటువంటి పాలసీలను విక్రయిస్తున్నాయి. కాంప్రెన్సివ్ కింద వాహనంతో పాటు ఇతర ప్రాణాలకు ఎటువంటి హానికలిగినా బీమా వర్తిస్తుంది. థర్‌పార్టీలో తమ వాహనం కారణంగా ఇతరుల ప్రాణాలు పోతే దానికి పరిహారం బీమా కంపెనీ చెల్లిస్తుంది. పబ్లిక్ లయబుల్టి కింద ప్రజలు, ప్రభుత్వ ఆస్తులకు ప్రాణాలకు భంగం కలిగినప్పుడు బీమా చెల్లిస్తారు. ప్రతి సంవత్సరం బీమా చెల్లించి ప్రీమియం తీసుకోవాలి. వాహనం తరుగును బట్టి ప్రతి సం వత్సరం ప్రీమియం మారుతుంటుంది. మొదటి సంవత్సరం పాలసీలను తీసుకుంటున్న వాహనదారుడు రెండో సంవత్సరం నుంచి దాని మీద దృష్టిపెట్టడం లేదన్న సంగతి అధికారులు తనిఖీలు నిర్వహించిప్పడు బయట పడుతోంది.

బీమా తప్పని సరిగా చేయించుకోవాలి

రోడ్లపై తిరిగే ప్రతి వాహనానికి బీమా తప్పని సరి గా చేయించుకోవాలని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాండురంగ నాయక్ చెప్పారు. మనం ఆరోగ్య బీమా మీద ఎంత దృష్టి పెడతామే అంతే దృ ష్టి వాహనాల మీద పెట్టాలన్నారు. ర వాణా వాహనాలు ప్రతి సంవత్సరం తప్పని సరిగా బీమా పు నరుద్ధరించుకోవాలని, బీమా పత్రాలు చూపిస్తేనే వాటికి సామర్థ పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు (ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు) ఇస్తారని తెలిపారు. వ్యక్తి గత వాహన యజమానులు బీమా విషయంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. బీమా లేని ద్విచక్ర వాహనాలు నగరంలో ఎక్కువగా ఉన్నాయన్నారు.
-జెటిసి పాండురంగ నాయక్

Comments

comments