Search
Friday 20 April 2018
  • :
  • :

చెన్నైకి పంజాబ్ షాక్..

Chris Gayle Hits Half Century in IPL's 12th Match

మొహాలీ: ఐపిఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు విజయం సాధించింది.చెన్నైపై 4 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు కెఎల్ రాహుల్(37), క్రిస్ గేల్(63) మెరుపు బ్యాటింగ్‌తో మంచి ఆరంభాన్నిచ్చారు. అగర్వాల్(30), కరణ్ నాయర్(29), యువరాజ్ సింగ్(20) పరుగులతో రాణించారు. చెన్నై బౌలర్లలో శార్దుల్, తాహిర్‌లు చెరో రెండు వికెట్లు తీయగా, హర్బజన్ సింగ్, వాట్సన్ బ్రావో తలో ఒక వికెట్ పడగొట్టారు.అనంతరం 198 పరుగుల భారీ లక్ష ఛేదనలో చెన్నై 5 వికెట్లు కోల్పోయి 193 పరుగుల చేసి ఓడిపోయింది. కెప్టెన్ ధోని 79, అంబటి రాయుడు 49 పరుగులతో రాణించారు. మిగితా ఆటగాళ్లు విఫలం కావడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. పంజాబ్ బౌలర్లలో ఆండ్రూ టై 2 వికెట్లు పడగొట్టగా, మోహిత్ శర్మ, అశ్విన్ తలో ఒక వికెట్ తీశారు.

Comments

comments