Search
Friday 20 April 2018
  • :
  • :

స్వీడన్‌ చేరుకున్న ప్రధాని మోడీ

Prime Minister Modi received by Swedish Prime Minister Stefan

స్టాక్‌హోం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు దేశాల పర్యటనలో భాగంగా సోమవారం స్వీడన్‌కు చేరుకున్నారు. రాజధాని స్టాక్‌హోమ్‌ చేరుకున్న మోడీకి ఆ దేశ ప్రధాని స్టెఫాన్‌ లొఫ్‌వెన్‌ స్వయంగా విమానాశ్రమానికి వచ్చి స్వాగతం పలికారు. స్వీడన్-భారత్ వాణిజ్య ఆర్థిక సంబంధాలపై ఇవాళ ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ప్రధాని మోడీ ఇండియా – నార్డిక్ సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో ఫిన్‌లాండ్, నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్ దేశాల ప్రధానులు కూడా పాల్గొంటారు. స్వీడన్ పర్యటన ముగించుకుని బ్రిటన్, జర్మనీలో ఈ నెల 20 వరకు మోడీ పర్యటించనున్నారు.

Comments

comments