Search
Friday 20 April 2018
  • :
  • :

బెంగళూరుపై రాజస్థాన్ విజయం

rr

బెంగళూరు: చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై 19 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 218 పరుగుల భారీ లక్ష ఛేదనలో బెంగళూరు జట్టు 6 వికెట్లు కోల్పోయి 198 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(57), డికాక్(26), డివిలియర్స్(20), మన్‌దీప్ సింగ్(47 నాటౌట్), వాసింగ్టన్ సుందర్ 35 పరుగులతో రాణించిన బెంగళూరుకు ఓటమి తప్పలేదు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 217 పరుగులు చేసింది. సంజు శాంసన్(92) మెరుపు బ్యాటింగ్‌తో రాజస్థాన్‌కు భారీ స్కోరు అందించాడు.రహానె(36), బెన్‌స్టోక్స్(27), బట్లర్(23) రాణించారు.

Comments

comments