Search
Friday 20 April 2018
  • :
  • :

రూ.100 కోట్ల నగదు స్వాధీనం

MONEY

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. చిక్కబళ్లాపూర్ జిల్లా తిప్పగానిపల్లి వద్ద బళ్లారి – అనంతపురం జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేశారు. ట్రావెల్స్ బస్సులో రూ.100 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం నగదును తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Rs.100 Crore Cash Recovered in Karnataka

Comments

comments