Search
Friday 20 April 2018
  • :
  • :

బిట్‌కాయిన్ల ఆచూకీ చెబితే రూ. 2 కోట్లు

bitcoins

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బిట్‌కాయిన్ చోరి వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్రముఖ క్రిప్టో కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ కాయిన్‌సెక్యుర్ నుంచి దాదాపు రూ.20 కోట్ల విలువైన 438 బిట్‌కాయిన్లు చోరికి గురయ్యాయి. ఈ దొంగతనానికి గురైన బిట్‌కాయిన్ల ఆచూకీ కోసం ఈ ఎక్స్‌ఛేంజీ తీవ్ర ఎత్తున్న ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో తాము కోల్పోయిన బిట్‌కాయిన్ల కనిపెట్టి, ఆచూకీ చెప్పిన వారికి రూ.2 కోట్ల రివార్డు అందిచనున్నట్టు కాయిన్‌సెక్యుర్ ప్రకటించింది. ‘మా నిధులను రికవరీ చేసుకునేందుకు హ్యాకర్లను గుర్తించడానికి మా యూజర్ల నుంచి, బిట్‌కాయిన్ కమ్యూనిటీ నుంచి సాయం కోరుతున్నాం’ అని కాయిన్‌సెక్యుర్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ వారం మొదట్లో తమ కంపెనీ వాలెట్ నుంచి రూ.20 కోట్ల విలువైన 438 బిట్‌కాయిన్లు చోరికి గురైనట్టు కాయిన్‌సెక్యుర్ ఢిల్లీ పోలీసు సైబర్‌సెల్ వద్ద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం ప్రకటించిన రివార్డు విలువ చోరికి గురైన మొత్తం విలువలో 10 శాతం. హ్యాకింగ్ ద్వారా జరిగిన బిట్‌కాయిన్‌ల చోరీలో అంతర్గత వ్యక్తుల పాత్ర ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు కాయిన్ సెక్యూర్ కంపెనీ వ్యవస్థాపకుడు,సిఇఒ మోహిత్ కర్లా చెప్పారు.

Comments

comments