Search
Friday 20 April 2018
  • :
  • :

అయోధ్యలో రామమందిరం నిర్మించాల్సిందే : మోహన్ భగత్

MOHAN-BHAGAWAT

ముంబయి : అయోధ్యలో రామ మందిరం నిర్మించాల్సిందేనని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగత్ స్పష్టం చేశారు. అక్కడ రామమందిరం నిర్మించకుంటే భారత సంస్కృతి మూలాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పాల్గాట్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విదేశీ ముస్లింలు అయోధ్యలోని రామ మందిరాన్ని కూల్చివేశారని, భారత ముస్లింలు ఇటువంటి పని ఎప్పుడూ చేయరని ఆయన పేర్కొన్నారు. రామమందిరాన్ని పునర్నిర్మించుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రామమందిరం నిర్మాణం కోసం సుప్రీంకోర్టులో ఆర్‌ఎస్‌ఎస్ పోరాడుతుందని ఆయన తెలిపారు. మొగల్ చక్రవర్తి బాబర్ 1528లో బాబ్రీ మసీదును నిర్మించారు. బాబ్రీ మసీద్ కంటే ముందే అక్కడ రామ మందిరం ఉందని కరసేవకులు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో 1992 డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేసిన విషయం తెలిసిందే.

RSS Chief Mohan Bhagwat Comments on Ram Mandir

Comments

comments