Search
Friday 20 April 2018
  • :
  • :

ప్రపంచ యుద్ధ భయాలు

int

అమెరికాపై ప్రతీకారానికి రష్యా హెచ్చరిక 

మాస్కో / న్యూయార్క్ : సిరియాపై రష్యా, అమెరికాలు సై అంటే సై అంటున్న దశలో మూడో ప్రపంచ యుద్ధం భయాలు కమ్ముకున్నాయి. రసాయనిక దాడుల నెపంతో అమెరికా అరాచకానికి దిగుతోందని దీనిని సహించేది లేదని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం హెచ్చరించారు. తాము ఊరుకునేది లేదని ,అమెరికా క్షిపణులకు, ఆంక్షలకు తగు విధంగా జవాబు చెపుతామని , అమెరికాపై భారీ స్థాయి ప్రతీకార చర్యలు ఉంటాయని పుతిన్ ప్రభుత్వం ప్రకటించింది. రష్యాపై అమెరికా పలు స్థాయిలలో ఆర్థిక ఆంక్షలు విధించింది. ఇప్పుడు అమెరికా నేతృత్వపు సంకీర్ణ దళాలు సిరియాలోని అధికార సేనల స్థావరాలపై నిర్ధేశిత మెరుపుదాడులకు దిగింది. ఈ నేపథ్యంలో రెండు అణ్వాయుధ శక్తివంత అగ్రరాజ్యాలు రష్యా అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇదిపలు విధాలుగా మూడో ప్రపంచ యుద్ధ సంకేతాలకు దారితీస్తోందని భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పుతిన్ ప్రభు త్వం ఇప్పుడు ట్రంప్ అధికార యంత్రాంగానికివ్యతిరేకంగా తీసుకోబోయే ప్రతీకార చర్యల దిశలో యోచిస్తోందని సండే ఎక్స్‌ప్రెస్ పత్రికలో కథనం వెలువడింది. కొద్ది రోజుల క్రితమే ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయంతో 38 రష్యా సంస్థలు, సీనియర్ అధికారులపై వేటు పడింది. రష్యా సంస్థలపై తీవ్రస్థాయి ఆంక్షల దిగ్బంధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కోణాల్లో రష్యాపై బురద చల్లే ప్రయత్నాలకు అమెరికా దిగుతోందని రష్యా ఆగ్రహిస్తోంది. ఇందుకు ప్రతిగా తాము తీసుకోబోయే చర్యలు ఉంటాయని అయితే ఈ దశలో వీటిని వెల్లడించేది లేదని రష్యా రవాణా మంత్రి మాక్సిమ్ సోకోలోవ్ పేర్కొన్నట్లు పత్రిక వెల్లడించింది. ఇప్పటికే ట్రంప్ చర్యలకు కౌంటర్‌గా రష్యా పలు కీలక నిర్ణయాలు తీసుకుందని, వీటిపై త్వరలోనే పార్లమెంట్‌లో ఆమోదం తీసుకుంటామని రష్యా అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా నుంచి వ్యవసాయ, ఆల్కహాలిక్, పొగా కు ఉత్పత్తుల దిగుమతుల నిషేధం,ఔషధాలపై వేటు వం టి చర్యలతో అమెరికాకు చెక్ పెట్టేందుకు రష్యా సిద్ధం అయి ంది. అమెరికా చర్యలపై తాము చూస్తూ ఉండలేమ ని, ఈ విధంగా ఉంటే చేతకాని తనం లేదా తమదే తప్పనే భావన ఏర్పడుతుందని రష్యా ఉన్నత నిర్ణయాక మండలి యోచిస్తోంది. బ్రిటన్ లో రష్యా మాజీ వేగుపై విష ప్రయో గం అంశం పలు విధాలుగా దౌత్య సంబంధాల క్షీణతకు దారితీసింది.
భద్రతా మండలిలో వీగిపోయిన తీర్మానం
ప్రస్తుత సిరియా సంక్షోభ తరుణం లో రష్యా అధికారిక టీవీ ఛానళ్లలో మూడోప్రపంచ యుద్ధ హెచ్చరికలతో వార్తలు వెలువడుతున్నాయి. పౌ రులు జాగ్రత్తగా ఉండాలని, మూడో ప్రపంచయుద్ధంముంచుకురావచ్చుననిఇందులో పేర్కొంటున్నారు.సిరియాలో అమెరికా దాడులను ఖండించాలని కోరుతూ తీర్మానం చేయాలనే ర ష్యా ప్రతిపాదనను భద్రతా మండ లి తిరస్కరించడంతో రష్యా నిరసనకు దిగింది. ఈ దశలోనే రష్యన్ టీవీలలో మూడో ప్రపంచ యుద్ధం వార్తలు వెలువడుతున్నాయి.రసాయనిక దాడుల పేరిట అమెరికా మిత్రపక్షాలు ఆగడాలుకు దిగుతున్నాయని వీటిని అరికట్టాల్సిన బా ధ్యత ఐరాసపై ఉందని రష్యా స్పష్టం చేసింది.అమెరికా బ ల ప్రయోగాలను నిరోధించాల్సి ఉందని, ఈ మేరకు తీర్మానం వెలువరించాలనిరష్యా చేసిన ప్రతిపాదనకు మండలికి చెందిన 15సభ్య దేశాలలో కేవలం చైనా బొలివియాల నుంచే మ ద్దతు దక్కింది. దీనితో రష్యా తీర్మాన ప్రతిపాదన వీగిపోయింది. ఎనిమిది దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి. నాలుగు దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరు అయ్యాయి.
దర్యాప్తుకు అమెరికా పట్టు
సిరియాలో రసాయనిక ఆయుధాల వాడకంపై ఐరాస దర్యాప్తు జరపాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు డిమాం డ్ చేశాయి. ఐరాస స్థాయిలో ఈ అంశంపై తక్షణం విచారణ జరిపించేందుకు తాము పట్టువదలని రీతిలో దౌత్య యత్నాలకు దిగుతామని అమెరికా సంకీర్ణ పక్షాలు తెలిపాయి. భద్రత మండలిలో ఓ వైపు రష్యా ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ జరుగుతున్న దశలోనే అమెరికా ఇతర దేశాలు సభ్య దేశాలకు తమ సంయుక్త ముసాయిదా ప్రతిపాదనను అందించాయి. రసాయనిక దాడులను నివారించాలి. సిరియా తక్షణం చర్చలకు తరలిరావాలని ఈ దేశాలు డిమాండ్ చేశాయి. తక్షణం ఈ కల్లోలిత దేశంలో కాల్పుల విరమణ జరగాలని ప్రతిపాదించారు. ఒక్కరాత్రి సిరియాపై వైమానిక దాడుల తరువాత అమెరికా ఇతర దేశాలు ఆ దేశాన్ని తద్వారా వెనుక ఉన్న రష్యాను దారిలోకి తేవాలని ముమ్మర యత్నాలకు దిగాయి. సిరియాలో రసాయనిక దాడులపై స్వతంత్య్ర స్థాయి దర్యాప్తు ఐరాస ఆధ్వర్యంలో జరగాల్సి ఉందని అమెరికా మిత్ర బృందం తమ ముసాయిదాలో కోరింది. అయితే సిరియాపై అమెరికా ఇతర దేశాల దాడుల ఖండనకు తీర్మానం చేయాలని రష్యా కీలక ప్రతిపాదన చేసింది. ఈ పరస్పర అంశాలతో భద్రత మండలిలో ఇప్పుడు నేరుగానే రష్యా అమెరికా మధ్య దౌత్య వివాదం నెలకొంది.

Comments

comments