Search
Friday 20 April 2018
  • :
  • :

విమానంలో గబ్బర్ గమ్మత్తు చూశారా..?(వీడియో)

Shikhar Dhawan and Shakib Al Hasan Fun in Flight

మొహాలి: ఐపిఎల్ పదకొండో సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌తో దూసుకెళ్తున్న క్రికెటర్ శిఖర్ ధావన్. గబ్బర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఐపిఎల్ లో విశేషంగా రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక తోటి క్రికెటర్లతో ధావన్ చాలా సరదగా ఉంటాడనేది అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు జట్టు సభ్యులను ఆటపట్టిస్తూ సందడి చేస్తుంటాడు. తాజాగా గబ్బర్‌కు సంబంధించిన ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఎస్‌ఆర్‌హెచ్ తన తరువాతి మ్యాచ్ కోసం ఇప్పటికే మొహాలీ చేరుకుంది. గురువారం పంజాబ్‌తో హైదరాబాద్ తలపడనుంది. దీనిలో భాగంగా సోమవారం విమానంలో సన్‌రైజర్స్ జట్టు మొహాలీ బయలుదేరింది. విమానంలో చాలా మంది ప్లేయర్స్ నిద్రలోకి జారుకున్నారు. గబ్బర్‌కు నిద్రరాకపోవడంతో హాయిగా నిద్రపోతున్న జట్టు సభ్యులపై చిలిపి చేష్టలకు దిగాడు. ఒక కాగితం ముక్కను తీసుకుని నిద్రలో ఉన్న షకీబుల్ హాసన్, రషీద్ ఖాన్ ముక్కులో పెట్టి వారిని నిద్ర లేపసాగాడు. ధావన్ చిలిపి చేష్టలు చూసి విమానంలోని వారందరూ పగలబడి నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా గబ్బర్ గమ్మత్తైన వీడియోపై ఓ లుక్కేయండి…

Comments

comments