Search
Friday 20 April 2018
  • :
  • :

యుపిలో అక్కాచెల్లెళ్ల హత్య

MURDER

లక్నో : యుపిలోని ఎత్వాలో అక్కాచెల్లెళ్లను దుండగులు కాల్చి చంపారు. సోమవారం సాయంత్రం అక్కాచెల్లెళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వారు రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో వారి కోసం కుటుంబ సభ్యులు వెతికారు. కానీ వారి ఆచూకీ తెలియరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎత్వా గ్రామ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ వద్ద అక్కాచెల్లెళ్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలిలో బుల్లెట్లు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Sisters Murder in UP

Comments

comments