Search
Friday 20 April 2018
  • :
  • :

సాయుధుల దాడిలో ఆరుగురు మృతి

Armed

కాబూల్ : వెస్టర్న్ ఘోర్ ప్రావిన్స్‌లో మంగళవారం ఉదయం సాయుధులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు పౌరులు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఘోర్ రాజధాని ఫరోజ్ కోహ్‌కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులంతా ఆప్ఘనిస్థాన్‌లోని షియా మైనార్టీకి చెందిన ఎత్నిక్ హజారస్ వర్గం వారు. ఎత్నిక్ హజారస్ హెరాత్ నుంచి వెస్టర్న్ ఘోర్ ప్రావిన్స్‌కు వారు వాహనంలో వెళుతుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడులు ఎవరు చేసింది తెలియరాలేదు. గతంలో ఇక్కడ ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్‌కు చెందిన ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడి కూడా వారే చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Six People Killed in Armed Attack at Afghanistan

Comments

comments